హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆగ్రహం అనంతపురం / రాప్తాడు (అక్టోబర్ 31): అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నిస్సహాయ బాలిక గోపిక లక్ష్మిపై ఒక ఉన్మాది మృగంలా దాడి చేసి, నడిరోడ్డుపై గొంతు కోసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పైశాచిక కాండను తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఆయన నిందితులకు, వ్యవస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు: ఉరిశిక్షే ఏకైక పరిష్కారం: ఇలాంటి కౄర మృగాలకు సాధారణ జైలు శిక్షలు, బెయిళ్ళు సరిపోవు. పట్టపగలు విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాదిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించి తక్షణమే ఉరికంభం ఎక్కించాలి. నడిరోడ్డుపై ఉరితీసినా ఇలాంటి ఉన్మాదులకు తప్పులేదు. భవిష్యత్తులో ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసినా వెన్నులో వణుకు పుట్టేలా శిక్ష ఉండాలి. బాధిత కుటుంబానికి న్యాయం: కంటికి రెప్పలా పెంచుకున్న కూతురిని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా అండగా