బాపట్ల, సెప్టెంబర్ 30: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లాలో మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. విజయమ్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వైద్య పరీక్షలు మరియు చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా మెగా క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు.
మెగా క్యాంప్‌లో ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల ద్వారా అవసరమైన వైద్య సలహాలు అందించినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా. ఎస్. విజయమ్మ కోరారు. సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తుందని డా. ఎస్. విజయమ్మ తెలిపారు.








