హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నీళ్ల నాగరాజు నియామకం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

హైదరాబాద్ / న్యూఢిల్లీ:
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి గారి ఆదేశాల మేరకు, సంస్థ జాతీయ కార్యాలయం తరపున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీ నీళ్ల నాగరాజు గారిని నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా HRCI జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్. ముత్యాల బాబు గారు నియామక పత్రాన్ని విడుదల చేస్తూ ప్రకటన చేశారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, అణగారిన వర్గాల హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేస్తున్న నీళ్ల నాగరాజు గారి సేవలను, నిబద్ధతను గుర్తించి సంస్థ ఈ కీలక బాధ్యతను అప్పగించిందని తెలిపారు.
ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని, నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీళ్ల నాగరాజు గారు రాష్ట్రవ్యాప్తంగా కౌన్సిల్ కార్యకలాపాలను బలోపేతం చేస్తూ, వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నట్లు డాక్టర్ ఎల్. ముత్యాల బాబు గారు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పౌరుడికి న్యాయం, హక్కుల రక్షణ లభించేలా క్షేత్రస్థాయిలో కమిటీలను సమన్వయం చేసుకుంటూ సంస్థ విస్తరణకు తోడ్పడాలని జాతీయ నాయకత్వం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా శ్రీ నీళ్ల నాగరాజు గారికి HRCI జాతీయ కార్యవర్గం హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ ఎల్. ముత్యాల బాబు
జాతీయ ప్రధాన కార్యదర్శి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI)

The Bharat Vani
Author: The Bharat Vani

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail