నవోదయలో 9, 11 వ తరగతిలలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11 వ తరగతిలలో చేరుటకు వచ్చే విద్యా

సంవత్సరానికి 2027-2028 మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సి.శివరాం బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 8, 10 వ తరగతి చదువుకున్న విద్యార్థులు విద్యా సంవత్సరం 2026-2027 మాత్రమే అర్హులని వారు మాత్రమే ఆన్లైన్ లో లేదా అఫ్ లైన్ అప్లై చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. అప్లికేషన్స్ కావలిసిన వారు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం నందు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటే పూర్తి వివరాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ఆఫీస్ నందు సంప్రదించాలని లేదా అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్ లో చూడాలని తెలిపారు.అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వ తేదీ.9 వ తరగతి కోసం : https://cbseitms.nic.in/2026/nvsix_9

11 వ తరగతి కోసం : https://cbseitms.nic.in/2026/nvsix_11

పైన తెల్పిన వెబ్సైట్ లలో దరఖాస్తు లను చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

The Bharat Vani
Author: The Bharat Vani

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail