రూ.12 లక్షలతో మార్టూరులో నూతన శాశ్వత అంగన్వాడీ భవనం ప్రారంభం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మార్టూరు, ఆగస్టు 3 (క్రౌన్ హ్యూమన్ రైట్స్):

మార్టూరు గ్రామంలోని గొట్టిపాటి నగర్ కాలనీలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన శాశ్వత అంగన్వాడీ భవనాన్ని పంచాయతీ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సీడీపీఓ మరియు కూటమి నాయకులు సోమవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తల్లిదండ్రులు, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నూతన అంగన్వాడీ భవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఈ భవనం కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, గ్రామస్తులు నూతన శాశ్వత అంగన్వాడీ భవనం నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామంలోని చిన్నారుల భవిష్యత్తుకు ఇది ఒక మంచి ముందడుగని అభినందించారు.

thebharatvani1
Author: thebharatvani1

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail