మార్టూరులో ఘనంగా HRCI, సాయి ఆరిక హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మార్టూరు పట్టణ పరిధిలోని బలరాం కాలనీ (చెరువు దగ్గర) ఉన్న సచివాలయం-2 వద్ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) మరియు సాయి ఆరిక హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డా. G.V.S. రాహుల్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డా. వాకా హరిప్రియాంక (పీడియాట్రిషియన్), డా. దినేష్ (ఈఎన్టీ స్పెషలిస్ట్) పాల్గొని రోగులను పరీక్షించి ఉచిత వైద్య సలహాలు అందించనున్నారు. దీంతోపాటు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి అనేక విభాగాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా అందించబడతాయి.

ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని HRCI అడిషనల్ జనరల్ సెక్రటరీ షేక్ మౌలాలి కోరారు. ఇతర వివరాల కొరకు 9505857561 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

 

The Bharat Vani
Author: The Bharat Vani

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail