​రూ.40 వేల ప్రీమియం తీసుకుని నట్టేట ముంచారు: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై సీనియర్ జర్నలిస్ట్ సౌరి సుబ్బారావు సంచలన ఆరోపణలు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

క్యాష్‌లెస్ నిరాకరణ.. రీయింబర్స్‌మెంట్ తిరస్కరణ.. గుండెపోటు బాధితుడికి రూ.12 లక్షల షాక్.. వినియోగదారుల ఫోరంలో తేల్చుకుంటానన్న జర్నలిస్ట్

చీరాల, 3 అక్టోబర్ 2026:

ఆపద సమయంలో ఆదుకుంటుందని నమ్మి భారీగా ప్రీమియం చెల్లిస్తే.. తీరా ప్రాణాల మీదకు వచ్చాక చేతులెత్తేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలసీదారులను చిన్నచిన్న కారణాలతో ముప్పుతిప్పలు పెడుతూ క్లెయిమ్‌లను నిరాకరిస్తోందని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సౌరి సుబ్బారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రూ.10 లక్షల పాలసీ ఉన్నా దక్కని సాయం

సుబ్బారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 26న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘సూపర్ స్టార్’ పాలసీని ఏటా రూ.40,000 ప్రీమియంతో రూ.10 లక్షల కవరేజ్ కోసం తీసుకున్నారు. అయితే, సరిగ్గా నెల తిరిగేసరికి (మే 26న) చీరాలలో ఆయనకు గుండెపోటు వచ్చింది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రాథమిక చికిత్స పొంది, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు.

అడుగడుగునా స్టార్ హెల్త్ దగా!

ఆసుపత్రిలో చేరిన వెంటనే క్యాష్‌లెస్ (నగదు రహిత) చికిత్స కోసం దరఖాస్తు చేయగా, సంస్థ ఏకపక్షంగా తిరస్కరించింది. “ముందు బిల్లులు చెల్లించండి.. తర్వాత రీయింబర్స్‌మెంట్ చేస్తాం” అని అధికారులు నమ్మబలికారు. గుండెకు రెండు స్టెంట్లు వేయించడానికి అప్పుసొప్పు చేసి రూ.6 లక్షలు చెల్లించారు. డిశ్చార్జ్ అయ్యాక రీయింబర్స్‌మెంట్ కోసం సమర్పించగా, ఆ క్లెయిమ్‌ను కూడా స్టార్ హెల్త్ కంపెనీ మొండిగా తిరస్కరించింది. ఆ తర్వాత మరో రెండు స్టెంట్ల కోసం ఇంకో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు ఖర్చు చేసినా ఒక్క రూపాయి కూడా కంపెనీ ఇవ్వలేదు.

“ప్రాణాలు పోయే పరిస్థితుల్లో రూ.12 లక్షలు బిల్లు అయితే.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా స్టార్ హెల్త్ నిలువునా మోసం చేసింది. కారణం లేకుండా క్లెయిమ్ ఎందుకు తిరస్కరించారో కంపెనీ సమాధానం చెప్పాలి. ఈ మోసంపై వినియోగదారుల ఫోరంలో తేల్చుకుంటా.”

— సౌరి సుబ్బారావు, సీనియర్ జర్నలిస్ట్

The Bharat Vani
Author: The Bharat Vani

Share करें

✓ Link copy हो गया!

Leave a Comment

और पढ़ें

traffic tail