
రేపల్లె:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లె పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘పేదలకు సేవలో’ కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కోసం గురువారం రేపల్లె విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఘన స్వాగతం లభించింది.
రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఎస్పీ ఉమామహేశ్వర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా రేపల్లె పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసింది. కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా సాగేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.








